లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కాన్వాయ్‌కు ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే హాలియాపూర్‌లో సోమవారం ఉదయం 10.15 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. కాన్వాయ్ ముందు వైపు కాంగ్రెస్ నేతకు చెందిన ఒక ప్రైవేటు వాహనం వెళుతోంది. ఆ వాహన డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో వెనుక కాన్వాయ్‌లో వస్తున్న వాహనాల్లో ఐదు వెహికల్స్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు భద్రతా సిబ్బంది, పార్టీ కార్యకర్తలు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.