రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా BJP కసరత్తు వేగవంతం చేసింది. ఢిల్లీలో ఆదివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్న ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, పార్టీ మీడియా మరియు ఐటీ విభాగాల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రత్యర్థి పార్టీల ఆరోపణలను తిప్పికొట్టేందుకు ‘సేవ్ డెమోక్రసీ, రిమూవ్ అనార్కీ’ (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, అరాచకాన్ని తరమండి ) పేరుతో దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది.