గుజరాత్‌లోని కచ్ జిల్లాలో భారత్-పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని సర్ క్రీక్ ప్రాంతంలో శనివారం సాయంత్రం బీఎస్‌ఎఫ్ సిబ్బంది గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భారత జలాల్లోకి అనధికారికంగా ప్రవేశించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు పాకిస్థానీ జాలర్లను అదుపులోకి తీసుకున్నారు. వారు ప్రయాణిస్తున్న ఒక పడవను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు. సున్నితమైన సరిహద్దు ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తుండగా ఈ పట్టివేత జరిగినట్లు బీఎస్‌ఎఫ్ వర్గాలు తెలిపాయి.