భారత వాయుసేన 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తర్ప్రదేశ్ వారణాసిలో వైమానిక ప్రదర్శన చేపట్టింది. నమో ఘాట్ వద్ద జరిగిన ముగింపు వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం, సారంగ్ హెలికాప్టర్ల బృందం చేసిన సాహసోపేత విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఆపరేషన్ సిందూర్లో కీలక పాత్ర పోషించిన రఫేల్ యుద్ధవిమానాలు కూడా విన్యాసాల్లో పాల్గొన్నాయి. అంతకుముందు ప్రధాని మోదీ వారణాసిలో రోడ్ షో నిర్వహించారు.