ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం రాబోయే రోజుల్లో క్రమంగా బలపడి తుపానుగా మారనుందని వాతావరణ శాఖ అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. అక్టోబర్ 28న తెలంగాణలోని మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు లేదా కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఉత్తర, తూర్పు మరియు దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనూ భారీ వర్ష ప్రభావం కనిపించనుంది.