కీరన్ పొలార్డ్ 22 ఏళ్ల వయసులో ముంబై ఇండియన్స్ జట్టులో చేరారు. అప్పటి నుంచి దాదాపు 16 ఏళ్ల పాటు ఆ జట్టుతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఆటగాడిగా ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆయన.. ఇటీవల బ్యాటింగ్ కోచ్‌గా కూడా పనిచేశారు. ఇప్పుడు హెడ్ కోచ్‌గా కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. ఆటతీరులో వ్యూహాలు, ప్రత్యర్థి జట్లను ఎదుర్కొనే విధానాలపై పొలార్డ్‌కు మంచి అవగాహన ఉంది. ఈ అనుభవం జట్టును విజయాల బాటలో నడిపించేందుకు ఉపయోగపడుతుందని ముంబై ఇండియన్స్ యాజమాన్యం భావిస్తోంది.