వైసీపీ మాజీ మంత్రి విడదల రజినిని తోసేసిన ఘటనలో చిలకలూరిపేట రూరల్ ఎస్సై ప్రియాంకపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఆమెను వెంటనే విధుల నుంచి తప్పించడంతో పాటు విచారణకు విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వాలని పోలీస్ అధికారులను ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం విడదల రజిని తన ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఎస్సై ప్రియాంక అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆమె కిందపడిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.