న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత యువ సంచలనం తిలక్ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేసి టీమిండియాకు సంచలన విజయాన్ని అందించాడు. న్యూజిలాండ్ నిర్దేశించిన 181 పరుగుల ఛేజింగ్‌లో 70/5తో తీవ్ర కష్టాల్లో ఉన్న భారత్‌ను కేవలం 26 బంతుల్లో 51 పరుగులు (6 ఫోర్లు, 1 సిక్స్) చేసి.. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది.