గద్వాలలో జూరాల ప్రాజెక్టు సూపరింటెండింగ్ ఇంజనీర్ (SE) కార్యాలయంలో కార్యాలయంలో భద్రపరిచిన పాత రికార్డులను ఒక ఉద్యోగి కాల్చివేసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఈ కార్యలయం రికార్డు అసిస్టెంట్ ఈశ్వరయ్య డివిజన్ -1 బదిలీ పై వెళ్తూ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా తగలబెట్టినట్లు సమాచారం.అందులో ఒరిజినల్ సంతకాలు ఉన్న పత్రాలు (ఆధారాలు/ఫైళ్లు) కూడా ఉన్నట్లు తెలుస్తోంది. “పాత రికార్డులే కదా” అనే ఉద్దేశంతో ఉదాసీనంగా కాల్చేశారా? లేక ఏదైనా అక్రమాలను కప్పిపుచ్చేందుకు ఉద్దేశపూర్వకంగా ఈ పనికి ఒడిగట్టారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.