ఏపీలోని నాలుగు పట్టణ స్థానిక సంస్థలకు నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, 2 మున్సిపాలిటీలకు ఇచ్చిన 48 గంటల అదనపు సమయం పూర్తయింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయా స్థానాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో 18, కడప మున్సిపల్ కార్పొరేషన్లో 11 వార్డులకు, రాజంపేట మున్సిపాలిటీలో 11, మైదుకూరు మున్సిపాలిటీలో మొత్తం వార్డుల్లో నామినేషన్లు దాఖలయ్యాయి.