ఫిలిప్పీన్స్ దేశంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వైమానిక దళానికి చెందిన రెండు శిక్షణ విమానాలు ఆకాశంలోనే ఒకదానికొకటి ఢీకొని నేలకూలాయి. ఈ దుర్ఘటనలో నలుగురు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. మనీలా నగరానికి దక్షిణ దిశలో ఉన్న ఫెర్నాండో ఎయిర్ బేస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి గురైనవి ఎస్ఎఫ్-260 (SF-260) సింగిల్ ప్రొపెల్లర్ శిక్షణ విమానాలు. రొటీన్ వైమానిక విన్యాసాల్లో (ట్రైనింగ్ డ్రిల్స్) పాల్గొంటున్న తరుణంలో ఈ రెండు జెట్లు గాల్లోనే ఢీకొన్నట్లు వీడియో ఫుటేజ్ ద్వారా స్పష్టమవుతోంది.