‘ఆదర్శ కుటుంబం’ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మల్లారెడ్డి విద్యాసంస్థల వైస్ ఛైర్మన్ ప్రీతి రెడ్డి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.
విద్యార్థులు కోరారనే కారణంతో సినిమా రిలీజ్ రోజు కళాశాలలకు హాలిడే ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే, ఒక సినిమా విడుదల కోసం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంపై ప్రస్తుతం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విద్యార్థులకు చదువు చెప్పాల్సిన విద్యాసంస్థలు సినిమా కోసం హాలిడే ఇవ్వడం ఏమిటని పలువురు నెటిజన్లు, విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.

