అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తాజా నివేదిక ప్రకారం మహిళలపై నేరాల కేసులున్న ప్రజాప్రతినిధుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఏపీలో మొత్తం 22 మంది (21 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ) ఈ జాబితాలో ఉండగా, రాష్ట్ర ప్రభుత్వంలోని నలుగురు మంత్రులపై కేసులు ఉన్నట్లు ఏడీఆర్ పేర్కొంది. ఒక వివాదాస్పద ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు ఉండగా, ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన యువ ఎంపీతో పాటు రాజ్యాంగ పదవిలో ఉన్న సీనియర్ నేతపై కూడా అభియోగాలున్నట్లు తెలిపింది.

