చంద్రబాబు, ఎస్ఈసీ దుర్మార్గంగా వ్యహరిస్తున్నారంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు సర్కార్ అరాచకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకపక్షంగా గెలవాలని చంద్రబాబు చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ‘‘నామినేషన్లు వేయించి ధైర్యంగా ఎందుకు ఓట్లు ఎందుకు అడగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వీటిని ఎన్నికలంటారా?. మహాభారతంంలో శకునికి పాచికలు ఉండేవి. ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ పడేలా గేమ్ సెట్ చేసేవారు. ఈ వ్యవస్థలో చంద్రబాబే శకుని.. చంద్రబాబు రూల్స్ సెట్ చేస్తున్నారు