పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు (అక్టోబర్ 23) సందర్భంగా ఆయన అభిమానులకు ఓ అద్భుతమైన కానుక ఇచ్చింది కల్కి టీమ్. ఆ చిత్రానికి కొనసాగింపుగా రాబోతున్న ఎపిక్ సీక్వెల్ ‘కల్కి 2’ నుంచి చిత్రబృందం ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన బర్త్‌డే స్పెషల్ గ్లింప్స్‌లో భైరవ పాత్రను మరింత పవర్‌ఫుల్ అండ్ స్టైలిష్‌గా చూపించి, సీక్వెల్‌పై ఉన్న అంచనాలను మేకర్స్ అమాంతం పెంచేశారు.