బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం రాగల రెండు రోజుల్లో వాయుగుండంగా మారి కోస్తాంధ్ర వైపు దూసుకొచ్చే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ మరికొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, రైతులు పంటలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు సూచించారు.