రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా అక్టోబర్ 30 నుంచి నవంబర్ 16లోపు విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ తెలిపారు. హెచ్ఎంలు నవంబర్ 17లోపు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించాలని, విద్యార్థుల డేటాను నవంబర్ 18లోపు డీఈఓలకు అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 16 నుంచి 28 వరకు పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించారు.