అక్టోబర్ 28న ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ పోలింగ్ జరగనుండగా, అదే సమయంలో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అక్టోబర్ 26 నుంచి 28వ తేదీ వరకు వర్షాల ప్రభావం ఉండొచ్చని చెబుతున్నారు. తమిళనాడు తీరానికి సమీపంలోని నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం కొనసాగుతోంది. దీని ప్రభావంతో అక్టోబర్ 26 నుంచి 28 వరకు ఏపీలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

