దేశీయ మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నడుమ మన సూచీలు రాణిస్తున్నాయి. అయితే, చమురు మంటలు సూచీల దూకుడును అడ్డుకుంటున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఉదయం 9.43 గంటల సమయంలో సెన్సెక్స్ 800 పాయింట్లు ఎగబాకి, 74,917 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ 211 పాయింట్లు పుంజుకొని, 23,100 వద్ద ట్రేడవుతోంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ ట్రేడింగ్ ప్రారంభంలో 18 పైసలు పెరిగి రూ.94.73గా ఉంది.