నెల్లూరు నగరంలో మొత్తం 72 డివిజన్లు ఉన్నాయి. కాగా.. టీడీపీ 183 వార్డుల్లో, వైసీపీ 186 వార్డుల్లో, జనసేన 43 చోట్ల నామినేషన్లు దాఖలు చేసాయి. జనసేన తమకు 30 శాతం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. టీడీపీ అందుకు అంగీకరించటం లేదు. పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ చర్చలు జరిపారు. 5 సీట్లు మాత్రమే ఇస్తామని మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలిపారు.అయితే 30 శాతం సీట్లు ఇవ్వాలని కోరారు. అందుకు ససేమిరా అంటూ సమావేశం నుంచి వెళ్లిపోయారు.