అంగరంగ వైభవంగా సాగిన విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకలు ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. కరవును జయించే శక్తిని ఇవ్వాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దుర్గమ్మను కోరుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ముగింపు వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్నివాల్ ఆకట్టుకుంది. దసరా శరన్నవరాత్రి ముగింపు వేడుకల సందర్భంగా కృష్ణా నదిలో హంసవాహన తెప్పోత్సవం నిర్వహించారు.

