బ్రిటన్ రాజధాని లండన్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) పై విద్యార్థి సంఘాలు, యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలకు ప్రతిగా పలువురు ప్రవాస భారతీయులు ఆందోళన చేపట్టారు. భారత ప్రభుత్వానికి మద్దతు తెలిపే ప్రవాసులు ‘టీమ్ భారత్’ పేరుతో ఒక బృందంగా ఏర్పడి ర్యాలీ నిర్వహించారు. లండన్లో చోటుచేసుకున్న ఈ పరిణామాలు భారత రాజకీయాల ప్రభావం విదేశాల్లోని ప్రవాస సమాజాలపైనా ఎలా ఉంటుందో మరోసారి చర్చకు తెచ్చాయి