పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో దుర్గాపూజ మండపం వద్ద తొక్కిసలాట జరిగి 17 మంది మృతి చెందారు. మరో 35 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మృతుల్లో 13 మంది మహిళలు, ముగ్గురు పురుషులు, ఒక చిన్నారి ఉన్నట్టు తెలిసింది. దుర్గా పూజ కోసం భారీగా భక్తులు చేరుకున్న సమయంలో ఒక్కసారిగా భారీగా గాలివాన మొదలైంది. పార్కు వద్ద మండపం బయట వేచిచూస్తున్న వారంతా ఒక్కసారిగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తొక్కిసలాటకుదారితీసింది.