యెమెన్ దేశంలోని ఓడరేవు పట్టణమైన ఏడెన్ లోని విమానాశ్రయంపై శుక్రవారం రాత్రి రెండు క్షిపణులు దాడి చేశాయని పోలీసులు వెల్లడించారు. ఇరాన్ మద్దతు ఉన్న హోతీ తిరుగుబాటుదారులే దీనికి కారణమని, గత పదిరోజుల్లో విమానాశ్రయంపై జరిగిన రెండో దాడి ఇది అని పేర్కొన్నారు. అయితే ఈ దాడిలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదన్నారు. యెమెన్ ప్రభుత్వ సమాచార మంత్రి వివరిస్తూ యెమేనియా ఎయిర్వేస్ నిర్వహిస్తున్న విమానం బయలుదేరడానికి సిద్ధం అవుతుండగా, 500 మీటర్ల దూరంలో ఈ క్షిపణులు కూలాయని చెప్పారు.