దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓల్లో ఒకటిగా నిలవనున్న రిలయన్స్ జియో ఐపీఓ కోసం ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఎగబడుతున్నారు. ఇష్యూ ఇంకా మార్కెట్లోకి రాకముందే గ్లోబల్, డొమెస్టిక్ దిగ్గజ సంస్థల నుంచి కనీవినీ ఎరుగని స్పందన లభిస్తోంది. బిగ్ ఇన్వెస్టర్లు ఇప్పటికే ఏకంగా రూ. 2.5 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించినట్లు, జియో ఐపీఓలో భారీ ఎత్తున వాటాలు దక్కించుకునేందుకు సింగపూర్, నార్వే, అబుదాబి, ఖతార్లకు చెందిన ప్రభుత్వ ఫండ్లు ఇందులో పెట్టుబడులకు సిద్ధమైనట్లు సమాచారం.