దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం జరిగిన తిరంగా యాత్ర సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అభిజీత్ దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన అరెస్ట్ అయిన కొద్ది నిమిషాలకే, ఈ నిరసనలో పాల్గొనేందుకు వెళుతున్న ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరాను, ఇతర వామపక్ష కార్యకర్తలను మండి హౌస్ వద్ద పోలీసులు నిర్బంధించారు. సీజేపీ సహ కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాల అరెస్ట్కు నిరసనగా అభిజీత్ దీప్కే ఈ ‘తిరంగా అసెంబ్లీ’కి పిలుపునిచ్చారు.