సీజేపీ తిరంగా మార్చ్ వేళ శుక్రవారం దేశ రాజధాని దిల్లీలో ఉద్రిక్తత నెలకొంది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరోల్బాగ్ ఆయన బస చేసిన చోటు నుంచి కన్నాట్ ప్లేస్లోని సెంట్రల్ పార్కు వద్దకు బయల్దేరడానికి సిద్ధమవుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వాహనాన్ని ముందుకు వెళ్లనివ్వకుండా నిరసనకారులు చుట్టుముట్టారు. పోలీసులు తనను అరెస్ట్ చేయడంపై దీప్కే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ చట్టాన్ని ఉల్లంఘించినందుకు తనను నిర్బంధించారో చెప్పాలని ప్రశ్నించారు.