ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున చీర, సారె సమర్పించారు. ఇంద్రకీలాద్రి చేరుకున్న చంద్రబాబు దంపతులకు దేవాదాయశాఖ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దుర్గమ్మ దర్శనం అనంతరం పండితులు సీఎం దంపతులకు వేదాశీర్వచనం చేశారు.