కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ విధానాన్ని(CNAP) నవంబర్ 1 నుంచి అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విధానం ప్రకారం 4జీ, 5జీ వంటి ఆధునిక మొబైల్ నెట్వర్క్ల వినియోగదారులకు సీఎన్ఏపీ సేవలను డిఫాల్ట్గా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఫోన్ వచ్చినప్పుడు తెరపై మొదట కాలర్ నంబర్, ఆ తర్వాత పేరు కనిపిస్తాయి. ఆ నంబర్ ఇప్పటికే మన ఫోన్లో సేవ్ చేసి ఉంటే, కాంటాక్ట్స్లో ఉన్న పేరే కనిపిస్తుంది. సేవ్ చేయని నంబర్ నుంచి కాల్ వస్తే, ఆ వ్యక్తి పేరును టెలికాం సంస్థ వద్ద నమోదైన చందాదారుల వివరాల ఆధారంగా చూపిస్తారు.