జర్మనీలోని బొఖుమ్ నగరంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతిచెందగా.. ఐదుగురు గాయపడ్డారు. మృతుల్లో 25, 27 ఏళ్ల ఇద్దరు మహిళలు, 26 ఏళ్ల వ్యక్తి ఉన్నారు. హత్య అనుమానంతో అదే భవనంలో నివసించే 41 ఏళ్ల రొమేనియా వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా బుధవారం వెల్లడించింది. రెండో అంతస్తులోని ఫ్లాట్లో ముగ్గురి మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. పొగ పీల్చడంతో అస్వస్థతకు గురైన ఐదుగురిని ఆసుపత్రులకు తరలించారు.