పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని స్టేజ్ -1 లో మొదటి, రెండవ పంపులను మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం పూజలు నిర్వహించి మోటార్లను ప్రారంభించారు.ఎట్టకేలకు నీరు విడుదల కావడంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు ఎంతో సంబరపడ్డారు. అయితే ఈ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. మోటర్లు ఆన్ చేసిన మూడు గంటల లోపే పంపింగ్ పూర్తిగా నిలిచిపోయింది. అయితే భారీ మోటర్లను నడపడానికి అవసరమైన విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని, లో-వోల్టేజ్ కారణంగానే మోటర్లను నిలిపివేయాల్సి వచ్చిందని అధికారులు అనధికారికంగా పేర్కొన్నారు.