బ్యాంకింగ్ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్లో కేంద్ర ప్రభుత్వం, భారత జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) కలిగి ఉన్న వాటాలో అధిక భాగాన్ని వ్యూహాత్మక కొనుగోలుదారుకు విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కెనడా సంస్థ ఫెయిర్ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్ కు విక్రయించే వాటాలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 30.48 శాతం, ఎల్ఐసీకి చెందిన 30.24 శాతం ఈక్విటీ వాటాలు ఉన్నాయి. విక్రయం అనంతరం కేంద్ర ప్రభుత్వం బ్యాంకులో 15 శాతం, ఎల్ఐసీ 19 శాతం వాటాను కొనసాగించనున్నాయి.

