పార్వతీపురం మన్యం జిల్లాలో రోజురోజుకు విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు సుమారు 1580 ఉన్నాయి. వీటిలో 348 పాఠశాలలు 10 లేదా అంతకంటే తక్కువ మంది విద్యార్థులతో నెట్టుకొస్తున్నాయి. వీటిలో 6 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరని పరిస్థితి. 10 బడుల్లో కేవలం ఒక్క విద్యార్థి చొప్పున నమోదు కాగా, మిగిలిన 332 బడుల్లో ఇద్దరు నుంచి పది మంది పిల్లలు చదువుతున్నారు. జి.ఎల్.పురంలో 49, కురుపాంలో 44, సాలూరులో 43 పాఠశాలలు అత్యల్ప నమోదుతో మొదటి వరుసలో ఉన్నాయి.

