పశ్చిమ ఆసియాలో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు, సౌదీ అరేబియా మధ్య ఘర్షణలు తారాస్థాయికి చేరడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ భగ్గుమన్నాయి.బుధవారం నాటి ట్రేడింగ్లో అంతర్జాతీయ బెంచ్మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ డిసెంబర్ ఫ్యూచర్స్ 1.24 శాతం పెరిగి బ్యారెల్కు $107.02 స్థాయికి చేరుకోగా.. డబ్ల్యూటీఐ (WTI) ముడి చమురు నవంబర్ ఫ్యూచర్స్ 1.18 శాతం లాభపడి బ్యారెల్కు $95 మార్కును దాటాయి.