ఉండవల్లిలో భేటీ తర్వాత.. పున్నమిఘాట్లో నిర్వహించిన విజయవాడ ఉత్సవ్లో ఇద్దరు సీఎంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. నదుల అనుసంధానం గురించి సీఎం చంద్రబాబుతో చర్చించినట్లు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తెలిపారు. ‘అందరికీ నమస్కారం’ అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. విజయవాడకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ ప్రజలు ప్రతి చోటా ఘనస్వాగతం పలికారని చెబుతూ.. అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.