దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఐక్యంగా పోరాడతామని విపక్ష ‘ఇండియా’ కూటమి, పౌరసంఘాలు ప్రతిజ్ఞ చేశాయి. ఈ విషయంలో రాజకీయ, ప్రజా ప్రతిఘటన కొనసాగుతుందని. కచ్చితంగా విజయం సాధిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలోని తన నివాసంలో ‘ఇండియా’ కూటమి నేతలు, విద్యార్థి, పౌర సంఘాల సభ్యులతో సమావేశమైన రాహుల్.. వారికి తేనీటి విందు ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఓటు చోరీకి పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెడతామన్నారు.

