ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దర్శించుకున్నారు. చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం విజయ్.. నేరుగా దుర్గమ్మను దర్శించుకునేందుకు వెళ్లారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం పండితులు వేదాశీర్వచనం చేసి, అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. అక్కడి నుంచి సీఎం చంద్రబాబును కలిసేందుకు విజయ్ బయల్దేరి వెళ్లనున్నారు. ఇవాళ రాత్రికి విజయవాడ ఉత్సవ్లో పాల్గొననున్నారు