ఏపీ ప్రభుత్వం త్వరలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం జెడ్పీటీసీ, ఎంపీటీసీల రిజర్వేషన్లపై ప్రకటన విడుదల చేసింది. జెడ్పీ చైర్మన్లు 28లో బీసీలకు 7 స్థానాలు, జెడ్పీటీసీలు 661లో 152 సీట్లు బీసీలకు కేటాయించారు. ఎంపీటీసీలు 9913 స్థానాల్లో బీసీలకు 2400 స్థానాలు ఖరారు చేశారు. సర్పంచులు 13,351 స్థానాల్లో 3,128 స్థానాలు బీసీలకు కేటాయించారు. మున్సిపల్ అడ్మినిష్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.