మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల రిజర్వేషన్ల పైన అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు.. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ మేయర్ పదవిని ఎస్టీలకు, రాజమహేంద్రవరం, కర్నూలు నగరపాలక సంస్థలను ఎస్సీలకు కేటాయించి నట్లు తెలుస్తోంది.123 పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు 41 కేటాయించనున్నట్లు తెలిసింది. మొత్తం 17 నగరపాలక సంస్థల్లో బీసీలకు 5, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1 దక్కనున్నాయి. మహిళలు 50 శాతం కంటే ఎక్కువగా అంటే 9 మంది మేయర్లు కానున్నారు.