ఓట్ల చోరీకి వ్యతిరేకంగా, ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ రేపు(సోమవారం) ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. అందులో భాగంగా సుప్రీంకోర్టు వరకు మార్చ్ నిర్వహించి, భారత ప్రజల తరఫున ప్రధాన న్యాయమూర్తికి వినతిపత్రం సమర్పిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీ ముఖ్య నేతలంతా ఢిల్లీకి రావాలని ఏఐసీసీ ఇప్పటికే ఆదేశించినట్లు సమాచారం.