బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ద్వారా అడుగుపెట్టడానికి సిద్ధమైన శ్వేతా నాయుడు, స్టేజ్ మీద హౌస్లో కొనసాగుతున్న ఆట తీరుపై గట్టిగానే స్పందించారు.ఈటీవీలో ప్రసారమయ్యే అత్యంత ప్రజాదరణ పొందిన డాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ (Dhee) ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు అత్యంత చేరువయ్యారు. అటు బుల్లితెర డ్యాన్స్ షోలతో ఇటు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచిన శ్వేతా నాయుడు ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టడం షోపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

