గిరిజన గ్రామాలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో చేపట్టిన ‘అడవితల్లి బాట’ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా అక్కడి ప్రజల దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపే ప్రయత్నం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం రెండో దశలో మరో 1,341 రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం సంతోషకరమని చంద్రబాబు తన ట్వీట్లో వెల్లడించారు.