దిల్లీలో ఆందోళనల నేపథ్యంలో అదుపులోకి తీసుకున్న నిరసనకారులు, వివిధ పార్టీల నేతలందరినీ పోలీసులు విడుదల చేశారు. సీజేపీ ప్రతినిధులను మాత్రం విడుదల చేయలేదు. వారి విషయంలో చట్ట ప్రకారం నడుచుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు సీజేపీ ఆందోళనలు ఆదివారం కూడా కొనసాగుతాయని ఆ పార్టీ ప్రతినిధి అజింక్య శిందే ప్రకటించారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు