తమిళనాడు సీఎం విజయ్ ఏపీకి రాబోతున్నారు. ఈ నెల 13న విజయవాడ చేరుకోనున్న సీఎం విజయ్ విజయవాడ ఉత్సవ్ 2.0లో పాల్గొనబోతున్నారు. ఇటీవలే పలువురు టీడీపీ ఎంపీలు ఆయన్ను ప్రత్యేకంగా కలిసి ఉత్సవాలకు రావాలని కోరిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత విజయ్ ఏపీకి రాబోతుండటం ఇదే మొదటిసారి. ఇంద్రకీలాద్రి కొండపై దుర్గమ్మ వారిని దర్శించుకున్నాక.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు.