ఎల్ నినో కారణంగా రాష్ట్రంలో నీటి సంక్షోభం ముప్పు పొంచి ఉందని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పటి నుంచి వచ్చే ఏడాది జూన్ వరకు ప్రతి చుక్క నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు. భవిష్యత్తులో రాబోయే ముప్పును ముందే గ్రహించి.. ఇప్పటి నుంచి సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్తు సమస్య మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్లో విద్యుత్తు లభించడం లేదని అందుకే అందుబాటులో ఉన్న విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని ప్రజలను కోరారు.