తమిళనాడు సీఎం విజయ్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చెన్నెలో పాలవక్కంలోని ‘బాస్క్ బై కాఫీ’ షాప్కు వెళ్లారు. ఇద్దరు అగ్ర నేతలు అక్కడకు రావడంతో వారితో సెల్ఫీలు దిగేందుకు జనాలు ఎగబడ్డారు. సీఎం విజయ్ ఓపిగ్గా.. అందరితో ఫొటోలు దిగుతూ హాయ్ చెబుతూ వెళ్లిపోయారు.వీడియోలు సోషల్ మీడియాలో టాప్ ట్రెండ్ అవుతున్నాయి. సాయంత్రం యువతతో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ మధ్యాహ్నమే చెన్నై చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా నీలంకరైలోని సీఎం విజయ్ నివాసానికి చేరుకున్నారు.