కాక్రోచ్ జనత పార్టీ రంగంలోకి దిగింది. నేడు జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇందులో మమత బెనర్జీ కూడా పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రమే ఆమె కోల్ కత నుంచి ఢిల్లీ చేరుకున్నారు. భద్రత కారణాలు, నిషేధాజ్ఞలు విధించినందున పోలీసులు ఆమెను జంతర్ మంతర్ వరకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో సౌత్ అవెన్యూ బస్టాండ్ వద్ద ఆమె బైఠాయించారు. మెడలో సేవ్ డెమోక్రసీ అనే ప్లకార్డును ధరించి నిరసన తెలిపారు. ఆమెతో పాటు లోక్ సభలో తృణమూల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అభిషేక్ బెనర్జీ, పలువురు ఎంపీలు, ఇతర నాయకులు ఉన్నారు. వారందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.