దిప్కే, రాంకా, సౌరవ్ దాస్ లను పోలీసులు ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక బస్సులో గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారు. దీంతో నిరసనలకు అడ్డుకట్ట పడినట్లేనని ఢిల్లీ పోలీసులు భావించారు. కానీ గంటల వ్యవధిలోనే CJP అభిజీత్ దిప్కే రికార్డు చేసిన ఓ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఇందులో ఆయన.. ఢిల్లీ నిరసనల్ని తమ పార్టీలో మరో నేత ఆజింక్యా షిండే నడిపిస్తారని బాంబు పేల్చారు. దీంతో ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు ఢిల్లీ పోలీసులు పరుగులు తీస్తున్నారు.