సీఈసీ జ్ఞానేష్ రాజీనామా డిమాండ్ తో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి నిరసనకారులు ఢిల్లీకి బయలుదేరారు. నిరసనకారుల్ని రాజధానికి రాకుండా అడ్డుకోవడానికి ఢిల్లీ పోలీసులతో సమన్వయం చేసుకుని, తక్షణ నివారణ చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఢిల్లీలోకి అనధికారికంగా ప్రవేశించడానికి సీజేపీ మద్దతుదారులు చేస్తున్న ప్రయత్నాల దృష్ట్యా, నివారణ చర్యలు తీసుకోవాలని హోంశాఖ తన లేఖలో డీజీపీలకు పిలుపునిచ్చింది.