జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టేందుకు ఢిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టి కాక్రోచ్ జనతా పార్టీ నాయకులను అదుపులోకి తీసుకునేందుకు ఢిల్లీ పోలీసులు మహిళా పోలీసు అధికారులను రంగంలోకి దించడం చర్చనీయాంశమైంది జులై 20న నిరసనలో పురుష పోలీసులు మహిళా నిరసనకారులపై దాడి చేశారని కాక్రోచ్ జనతా పార్టీ గతంలో ఆరోపణలు చేసింది. సీజేపీకి మద్దతుగా ఉన్న యువత, మహిళల దృష్టిలో పోలీసుల ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండేందుకు..అలాగే సోషల్ మీడియాలో కథనాలు రాకుండా అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు ఈ వ్యూహాన్ని అనుసరించినట్లు సమాచారం.